'Organic Dragon Fruit Cultivation || G. Venkateshwarlu || Contact - 8500989301'

08:57 Jun 11, 2021
'డ్రాగన్ ఫ్రూట్... ! ఇటీవల మన మార్కెట్లలో కనిపిస్తున్న ఈ పండు.. ప్రజలను ఆకర్షిస్తోంది. పేరులో డ్రాగన్ అని ఉంది కాబట్టి.. ఇది మన దగ్గర పండదు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే... మన వ్యవసాయం  కూడా మిగతా రంగాల్లాకే విస్తృతమైంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇతర దేశాలకే పరిమితం అనుకున్న పంటలు కూడా ఇప్పుడు మన నేలల్లో సాగవుతున్నాయి. అలాంటి పంటల్లో.. ఒకటి డ్రాగన్ ఫ్రూట్. విస్తృతమైన ఆలోచనలకు అవకాశాలు అనేకం. గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన రైతు గోల వెంకటేశ్వర్లు... ఇవే మాటలని విశ్వసించారు. విభిన్నమైన ఆలోచనకు ఆచరణ రూపం ఇచ్చి.. తనకున్న  రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని నిర్ణయించారు. పంటపై పూర్తి సమాచారం సేకరించి, సాగు విధానాలను తెలుసుకున్నారు. పూర్తి సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ని పిటాయ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, ఫాస్పరస్, క్యాల్షియమ్, ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే... ఇటీవల ఈ పండ్లకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. వీటిని సాగు చేసిన రైతులకు మంచి ఆదాయం వస్తోంది. అందరికీ భిన్నంగా డ్రాగన్ ఫ్రూట్ సాగులో ముందుకు సాగుతున్న వెంకటేశ్వర్లు... పంటను మరో ఎకరంలో విస్తరిస్తున్నారు. తనలాగే అందరూ సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు.   -----------------------------------------------------------------------------------------------------------  Farmer #G. Venkateshwarlu cultivating #Dragon fruit in #Organic method. His farm is located in #Pulipadu village, #Gurajala mandal, #Guntur District of #Andhrapradesh. In one acre land Venkateshwarlu growing dragon fruit plants. And now plannig to expand it to one more acre. To #control pests and insects he uses #biofertilizers and #biopesticides. \'By cultivating high vitamin and protein dragon fruit #farmers can get good #income\' says Venkateshwarlu.' 

Tags: dragon fruit , organic farming , pitaya , dragon fruit farming , Dragon fruit cultivation , zbnf , health benefits of dragon fruit , dragon fruit in india , natural dragon fruit , ritunestham , rytunestham , రైతునేస్తం , రైతునేస్తం ఫౌండేషన్ , రైతునేస్తం వెంకటేశ్వరరావు , డ్రాగన్ ఫ్రూట్ , nature farming , సేంద్రియ వ్యవసాయం , rythunestham venkateswara rao , rythu nestham foundation , organic dragon fruit , గుంటూరు , cow based farming , telugu news magazine

See also:

comments